Pawan Kalyan as Deputy CMPawan Kalyan as Deputy CM

కొణెదల పవన్ కళ్యాణ్ అనే నేను అని ఒక మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక పార్టీని పెట్టనవసరం లేదు. దశాబ్ద కాలంగా ఏటికి ఎదురు ఈదుతూ, తిట్లు తింటూ, పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొంటూ తన పార్టీని నడపాల్సిన అవసరం జనసేన పవన్ కళ్యాణ్ కి లేదు. టీడీపీలోకో, బీజేపీలోకో జాయిన్ అయితే డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం ఇచ్చి తీరుతారు. అయన చెప్పిన వారికీ ఒక 15 సీట్లు వరకు కూడా ఇచ్చు తీరుతారు. ఇదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ అవ్వడం కోసమేనా పార్టీని పెట్టింది. ఇంత చిన్న విజయం కోసమేనా పొత్తులు పెట్టుకొన్నది? అంటే కానే కాదు అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడానికి, నిన్న టీడీపీతో పొత్తులు పెట్టుకోవడానికి ఒక నిగూఢ గాధ దాగి ఉంది. ఎదో సాధించాలి అనే ఆవేదన పవన్ కళ్యాణ్ లో ఉంది. తనను నమ్ముకొన్న తాడిత పీడిత బాధిత వర్గాల కోసం సాధించాల్సింది ఏదో ఉంది. వ్యవస్థలో మార్పు తేవాలి అనే తపన జనసేనాని పవన్ కళ్యాణ్ లో ఉంది.

ఇంతకీ పవన్ కళ్యాణ్ లక్ష్య సాధనలో ఎదురైన సవాళ్లు ఏమిటి? అసలు పవన్ కళ్యాణ్ విజయం/పరాజయం వెనుక ఉన్న ఏడు దశాబ్దాల దీన గాధ ఏమిటి అనేది నేటి తరం తెలిసికోవాలి. తృతీయ ప్రత్యామ్న్యా జండా ఎగురవేయడంలో అణగారిన వర్గాలు పడ్డ కష్టాలు ఏమిటి అనేది కూడా నేడు వివరించాలి.

జనసేనాని పవన్ కళ్యాణ్ విజయ గాధ ఏమిటంటే?

1.ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) లో రెడ్డి (Reddy), కమ్మ (Kamma) ఆధిపత్య పార్టీలు కాకుండా తృతీయ ప్రత్యామ్నాయం (Third alternative) రావాలి. అధికార సాధన దిశగా అడుగులు వెయ్యాలి అనేది ఏడూ దశాబ్దాల పాలిత వర్గాల కల. ఈ కలను సాధించిన మొదటి వ్యక్తి కొణెదల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).

2. ఏపీలో తృతీయ ప్రత్యామ్న్యాయం రావాలని ఒక రామ్ మనోహర్ లోహియా, ఒక అంబెడ్కర్, ఒక కాన్షిరాం లాంటివారు ఎన్నో కలలను కన్నారు. పార్టీలు అయితే ఎన్నో వచ్చాయి. కానీ అవి వెను వెంటనే కాల గర్భంలో కలిసి పోతుండేవి. నిలదొక్కుకో లేకపోయాయి.

3. సర్దార్ గౌతు లచ్చన్న, మంద కృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్య, దాసరి నారాయణ రావు, చిరంజీవి, ముద్రగడ పద్మనాభం, కేశన శంకరరావు లాంటి వారు ఎందరో పార్టీలు పెట్టినప్పటికే అవి కాలగర్భంలో కలిసి పోయాయి.

4. పాలిత వర్గాల నుండి పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి పార్టీ పెట్టడం, ఆ పార్టీ ఒక దశాబ్దం పైగా క్రియాశీల రాజకీయాల్లో ఉండడం, ఆ పెట్టిన పార్టీ ఒక గుర్తింపు పొందిన పార్టీగా మారడం అనేది జనసేననే. ఏడు దశాబ్దాల తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు జరగినట్లు నేను చూడలేదు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మాత్రమే దశాబ్దంపైగా నడవడం, ఎలక్షన్ కమిషన్ నుండి గుర్తింపు పొందడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇది పాలిత వర్గాలు కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ సృష్టించిన చరిత్ర.

లెగసీ లేదు కదా గుది బండలు వెళ్ళాడుతుండగా

5. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ అనే లెగసీ పై పార్టీని నడుపుతూ టీడీపీ ద్వారా అధికారంలోకి వస్తున్నారు. జగన్ రెడ్డి అయితే తండ్రి వైస్సార్ లెగసీ, జాతీయ కాంగ్రెస్ ద్వారా వచ్చిన వలసల లెగసీ పై పార్టీని నడుపుతూ అధికారంలోకి వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏ లెగసీ లేకుండా పార్టీ పెట్టి నేటి విజయం సాధించారు.

6. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనకు ఎటువంటి లెగసీ లేదు. కదా ప్రజారాజ్యం ఓటమి, కాంగ్రెస్ లో విలీనం, మూడు పెళ్లిళ్లు, కాపు పూర్వీకుల తప్పుడు నిర్ణయాలు, కంపు పట్టిన కాపు టాగ్ అనే నాలుగు గుది బండలు పవన్ కళ్యాణ్ కాళ్లకు, మెడకు వెళ్లడుతున్నాయి. నాలుగు గుది బండలు వేళ్ళాడుతుండగా… ఎంతో ధైర్యంతో, మొండి తనంతో పెట్టిన పార్టీ జనసేన. ఇది పాలిత వర్గాల కోసం పవన్ కళ్యాణ్ సృష్టించిన చరిత్ర.

7. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే నాటికి మెగా కుటుంబం కళ్యాణ్ బాబు వెంట లేరు. కాపు టాగ్ మాత్రం ఉంది గాని కాపు నాయకుల, కాపు సంఘాల మద్దతు జనసేనకు లేనే లేదు. పారిశ్రామిక వేత్తల అండ పవన్ కళ్యాణ్ కు అస్సలు లేదు. కుల నాయకుల సపోర్ట్ ఏమాత్రం లేదు. మీడియా లేదు. అణగారిన వర్గాల్లో ఐక్యత లేదు. ఏకాకులుగా మారిన కాపుల వల్ల పార్టీకి ఇతర కులాల మద్దతు నివ్వం అనే రోజులు ఉన్నవి. అటువంటి రోజుల్లో, దుర్భర పరిస్థితుల్లో ధైర్యంతో వచ్చిన పార్టీ జనసేన. ఇది పాలిత వర్గాల కోసం పవన్ కళ్యాణ్ సృష్టించిన చరిత్ర.

8. పార్టీ నడపడానికి ముఖానికి రంగులు వేసికొంటూ నాలుగు రాళ్లు సంపాదించడం, ఆ వచ్చిన డబ్బులతో పార్టీని నడపడం. ఇలా పది సంవత్సరాలు పైగా పార్టీని పవన్ కళ్యాణ్ నడుపుతూ వచ్చాడు. గుప్పెడు నాయకులతో, గంపెడు విజయాన్ని పవన్ కళ్యాణ్ సాధించాడు. ఇది పాలిత వర్గాల కోసం పవన్ కళ్యాణ్ సృష్టించిన చరిత్ర.

జనసేనాని శీలాన్ని శంకించన వారే గాని…

9. అణగారిన వర్గాల కోసం పార్టీని పెట్టి, ఆ పార్టీని నడపడం కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టాలను అర్ధం చేసికోకుండా విమర్శలు చేసిన వారే ఎక్కువ. అక్షర సత్యంతో సహా అనేక మంది సేనాని శీలాన్ని నిన్నటి వరకు శంకించిన గారే గాని పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన వారు లేరు.

10. ఒక పక్కన అక్షర సత్యం లాంటి వారి తిట్లను, హేళనలను సేనాని చిరు నవ్వుతో వింటూనే మరొక పక్కన కష్టాలను భరిస్తూ, తానూ నష్టాల్లో ఉన్నా గాని తన స్వేదంతో వచ్చిన డబ్బులతో పార్టీని నడుపుతూ, ఒంటి చేత్తో పార్టీని విజయం వైపుకు తీసికెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది పాలిత వర్గాల కోసం పవన్ కళ్యాణ్ సృష్టించిన చరిత్ర.

11. అందుకే పవన్ కళ్యాణ్ సాధించిన నేటి ఈ విజయం మోహోన్నతమైన విజయం. డిప్యూటీ సీఎం అనే పదవి చిన్నదే కావచ్చు. కానీ అది పవన్ కళ్యాణ్ తన సొంత మేధస్సుతో, వ్యూహాలతో సాధించిన విజయం. చీమకు చిప్పెడు నీళ్ళే మహా సముద్రంలా సేనాని నేడు సాధించిన డిప్యూటీ సీఎం పదవి, అణగారిన వర్గాలకు గొప్పదే. అణగారిన వర్గాలకు, పాలిత వర్గాలకు ఈ విజయం వల్ల ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. ఇది అణగారిన వర్గాల కోసం సేనాని సృష్టించిన చరిత్ర.

12. ఒకరు పార్టీ కింద అయిన డిప్యూటీ సీఎంకి, పవన్ తన రెక్కల కష్టంతో పెంచిన పార్టీ నుండి అయిన డిప్యూటీ సీఎం కి చాలా తేడా ఉంది. Both are not same. ఈ వాస్తవాన్ని అణగారిన వర్గాలు, పాలిత వర్గాలు తెలిసికోవాలి. అవసరమైతే పాలక వర్గాలకు తలఎత్తి చెప్పాల్సిన రోజు ఇది.

డిప్యూటీ సీఎం అనేది ఒక నాందీ ప్రస్తావన

13. నేటి మన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను ఎంత మంచిగా మనం ఉపయోగించు కొంటే మన జనసేన పార్టీ భవిత అంత ఎత్తుగా ఉంటుంది అని జనసేనాని పవన్ కళ్యాణ్ మొన్న ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు.

14. దీన్ని బట్టి సేనాని వ్యూహాలను అర్ధం చేసికోవచ్చు. సేనాని వ్యూహంలో నేటి విజయం ఒక భాగమే గానే నేటి విజయమే సేనాని వ్యూహం కాదు. రాబోయే రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ సాధించ బోతున్న విజయాలకు నేటి డిప్యూటీ సీఎం అనేది ఒక నాందీ ప్రస్తావన మాత్రమే. ఇదే వాస్తవం. ఇదే అక్షర సత్యం.

ఆలోచించండి… జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు సాధించింది రేపటి భావి ఆంధ్ర సీఎం సాధనకి అవసరమైన సాధన సంపత్తికి సాధనకే అని ఎలుగెత్తి చెప్పండి. అంతే గాని ప్రత్యర్థి పార్టీల విష ప్రచార ట్రాప్ లో పడి సేనానిని వ్యూహాలను శంకించకండి (Its from Akshara Satyam)

కన్నుల విందుగా ఏపీ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *