Pawan Kalyan with SurpanchesPawan Kalyan with Surpanches

గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లిస్తున్నారు
కనీస నిధులు లేక సర్పంచులు అవమానాలకు గురవుతున్నారు.
రాష్ట్రంలో పూర్తిగా పడకేసిన గ్రామాభివృద్ధి
జనసేన వస్తే కేంద్రం నిధులు నేరుగా పంచాయతీ ఖాతాలకు జమ
ప్రతీ ఒక్కరికీ పోటీ చేసే హక్కుని కాపాడుకుందాం
జనసేన మేనిఫెస్టోలో గ్రామ స్వరాజ్యంపై ప్రత్యేక దృష్టి
గ్రామ సర్పంచుల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ (Janasena Party) అధికారంలోకి వస్తే గ్రామా పంచాయితీలకు (Grama Panchayats) పునః ప్రాణ ప్రతిష్ట కల్పిస్తామని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హామీ ఇచ్చారు. గాంధీజీ కలలు గన్న గ్రామా స్వరాజ్యం (Grama Swarajyam) రావాలంటే పంచాయతీలు పరిపుష్టం కావాలని తెలిపారు. ‘గ్రామాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన నిధులను ప్రభుత్వం కనీసం ఆయా పంచాయతీలకు చెప్పకుండానే దారి మళ్లిస్తోంది. అసలు పంచాయతీ ఖాతాలకు ఎన్ని నిధులు వచ్చాయో, దేని కోసం ఇచ్చారో, వచ్చిన నిధుల్లో ఏ మేరకు మళ్ళించారో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గ్రామీణ దోపిడీ కాక మరి ఏమంటారు..? దీనిని బహిరంగ ప్రజా దోపిడీగానే భావించాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీల సమస్యలు జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రవ్యాప్త సర్పంచులతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ అంశాలమైన చర్చ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలు అన్న మౌలిక సూత్రాన్ని వైసీపీ (YCP Government) పూర్తిగా కాలరాస్తోంది. గ్రామీణ వ్యవస్థను క్రమక్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. గతంలోనూ ప్రభుత్వాలు గ్రామీణ వ్యవస్థలను పూర్తిగా పక్కనపెట్టే ఆలోచనలు చేసిన వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇది పూర్తి తారాస్థాయికి చేరింది. చిన్నప్పుడు పాఠాల్లో గ్రామాలు వాటి అభివృద్ధి నిధులు మీద చదువుకున్న మొత్తం సారాంశం ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో విభిన్నంగా అనిపిస్తుంది.

రాజకీయ ఒత్తిళ్లతో గ్రామ సభలు నిర్వహణ లేదు

గ్రామాల్లో కనీస అభివృద్ధికి నిధులు లేవు. మౌలిక సదుపాయాల ఊసే లేదు. గ్రామీణ వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. గ్రామ సభలు జరపడం కూడా రాజకీయ ఒత్తిళ్ళతో మాయమైంది. గ్రామ సభలు జరపకపోతే సర్పంచుల అధికారం పోయే అవకాశం ఉన్నప్పటికీ చాలాచోట్ల వాటిని పటిష్టంగా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. ఒక గ్రామానికి ఏం కావాలి..? ఎలాంటి అభివృద్ధి జరగాలి..? వచ్చిన నిధులు ఖర్చులపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన గ్రామసభలు సంవత్సరానికి రెండుసార్లు జరగడం లేదు. గ్రామాల్లో ఉన్న ఎన్నో సమస్యలను ప్రభుత్వం పక్కన పెట్టేస్తోంది. కేంద్రం నుంచి వస్తున్న నిధులు కేటాయింపులు జరగడం లేదు. అవి పంచాయతీలకు అందడం లేదు. ఇలా అయితే గ్రామ స్వరాజ్యం ఎలా సాధ్యమవుతుంది. గ్రామ అభివృద్ధి సమగ్ర స్వరూపం మీద కచ్చితంగా జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా దృష్టి పెడతాం.

కేరళ పంచాయతీ విధానం ప్రత్యేకం

పంచాయతీలను బలోపేతం చేసే విషయంలో కేరళ ప్రభుత్వం ఉత్తమంగా నిలుస్తోంది. గతంలోనూ కేరళ మంత్రి ఒకరు కేరళలోని స్థానిక సంస్థలు, పంచాయతీల పనితీరును చూడాలని ఆహ్వానించారు. అక్కడున్న పరిస్థితులను మీరు గమనిస్తే భవిష్యత్తులో కచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పారు. వారు అనుసరిస్తున్న విధానాలను కూడా నాతో పంచుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సర్పంచులకు కనీసం రోడ్లు, డ్రైన్లు, తాగునీరు అందించేందుకు కూడా నిధులు లేక దేహి అనాల్సిన పరిస్థితి వచ్చింది. చేసిన పనులకు కూడా బిల్లు రాని పరిస్థితి ఉంది. సమస్యలు చెప్పుకొందాం అంటే సర్పంచులకు ముఖ్యమంత్రి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడే కాదు ప్రథమ బాధ్యత తీసుకునే వ్యక్తి. గ్రామానికి పెద్దదిక్కు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా 90% అధికారి పార్టీకే ఎప్పుడు చెందుతాయి. వారు కూడా చాలామంది ఎందుకు గెలిచాం అన్నట్లు ఇంటి లోపలికి వెళ్లి ఏడ్చే పరిస్థితులు ఉన్నాయి. నిధులు రావు… విధులు లేవు… గౌరవం లేదు అన్నట్లుగా సర్పంచుల పరిస్థితి
తయారయింది.

నిధులు పంచాయతీ ఖాతాలకే జమ అవ్వాలని జనసేన లక్ష్యం

కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు ప్రత్యక్షంగా పంచాయతీల ఖాతాలకు జమ కావాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం అన్ని పంచాయతీల వద్ద యూనియన్ బ్యాంక్ ఖాతాలు తెరిపించింది. దీనిని అనుసరించి పంచాయతీలకు కేంద్రమే ప్రత్యక్షంగా నిధులు అందించేలా ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దల దృష్టికి తీసుకువెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ నిధుల మీద పెత్తనాన్ని తగ్గించేలా చూడాలని కోరుతాం. సర్పంచులకు 29 అధికారాలను నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ నిధుల దుర్వినియోగం మీద ఢిల్లీ స్థాయిలో పక్కా రిపోర్టు ఉంది. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర పెద్దలు నాతో ఇదే చెబుతారు. వివిధ పథకాలకు వేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని చెబుతున్నారు. పంచాయతీ సర్పంచులకు పంచాయతీ ఖాతాలో ప్రత్యక్షంగా నిధులు రావాలి.

అన్నీ మా కనుసైగలో జరగాలి అని వైసీపీ భావిస్తోంది

రాష్ట్రానికి వచ్చిన ఒక్క రూపాయి అయినా తన కనుసైగలోని వినియోగం జరగాలని వైసీపీ భావిస్తోంది. అందుకే పంచాయతీలకు వచ్చే నిధులు మీద పెత్తనం సాగిస్తోంది. పంచాయతీలకు వచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఎందుకు..? గ్రామాలు అభివృద్ధికి సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పక్కదారి పట్టిస్తూ దోపిడీ చేస్తోంది. గ్రామ సభల ముఖ్య ఉద్దేశాన్ని పక్కనపెట్టి వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న విషయం మీద పెద్ద ఎత్తున ఉద్యమం రావాలి. రాజకీయాలకు అతీతంగా దీనిపై అందరూ ఐక్యం కావాలి. జనసేన ప్రభుత్వంలో కేరళ తరహాలో స్థానిక సంస్థలను ఎలా బలోపేతం చేశారో అలా కచ్చితంగా చేసేందుకు ప్రయత్నం చేస్తాం. చెక్ పవర్ అనేది సర్పంచులకు తప్ప మరెవరికి లేదు. అంతటి విశిష్ట అధికారాన్ని నిర్వీర్యం చేసేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు గర్హనీయం. అధికారం చూడని కులాలకు స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు అనేవి కీలకం. సర్పంచులకు గతంలో ఎంతో గౌరవం ఉండేది ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడానికి వైసీపీ ప్రభుత్వ తీరే కారణం. కచ్చితంగా చెక్ పవర్ ఉన్న సర్పంచుల ఖాతాల్లోకి డబ్బులు రావాలి.

వాలంటీర్లు గ్రామ సర్పంచుల అధికారాన్ని హరిస్తున్నారు

గ్రామీణ స్థాయిలో వాలంటీర్లు అనే సమాంతర వ్యవస్థను తీసుకువచ్చి వైసీపీ ప్రభుత్వం పంచాయితీ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చింది. వాలంటీర్లు గౌరవ వేతనం రూ.5 వేలు అయితే సర్పంచులకు మాత్రం కేవలం గౌరవ వేతనం కింద రూ.3 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటున్న సర్పంచుల అధికారాలను వాలంటీర్లు నిర్వర్తిస్తున్నారు. నవరత్నాలు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వాలంటీర్లు సచివాలయాల వ్యవస్థను తీసుకోవచ్చామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం తర్వాత వైసీపీ కార్యకర్తల్లా వాలంటీర్లను తయారు చేసింది. దీంతో గ్రామీణ స్థాయిలో పంచాయతీలకు ప్రజలు రాకుండా కేవలం పంచాయతీల అధికారాలను కూడా క్షేత్రస్థాయిలో వాలంటీర్లే చలాయిస్తున్నారు. రాజకీయాలకు భిన్నంగా అంతా ఒక తాటిపైకి వచ్చి పంచాయతీ వ్యవస్థను బతికించుకునేందుకు ఒక మాట మీద నిలుద్దాం.

ఏకగ్రీవాలకు జనసేన వ్యతిరేకం

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేయడానికి జనసేన పూర్తిగా వ్యతిరేకం. కచ్చితంగా దీనిపై కేంద్ర పెద్దలతోనూ మాట్లాడి ఒక చట్టాన్ని తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తాం. ఏకగ్రీవాల ముసుగులో పంచాయతీల్లో బెదిరింపుల పర్వం బహిరంగంగా సాగుతోంది. రిజర్వేషన్ను బట్టి ఆయా పంచాయతీల్లో తమకు అనుకూలమైన వారిని ఆయా గ్రామ పెద్దలు నిలబెట్టి, వారిని కేవలం బొమ్మలుగా మిగులుస్తున్నారు. చైతన్యవంతమై గ్రామాల్లో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వస్తే వారిని బెదిరిస్తున్నారు. కావలి నియోజకవర్గంలో దళిత వర్గానికి చెందిన ఒక యువకుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తాను అని తిరిగితే, గ్రామ పెద్దల మాట విననందుకు అతని బెదిరించి, తర్వాత ప్రమాదంలో అతడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ యువకుడు తల్లి నా దగ్గరికి వచ్చి బోరున విలపించడం ఇప్పటికీ నాకు గుర్తే. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కును కాలరాసేలా ఏకగ్రీవాలకు తెరలేపడం సరికాదు. ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక ఓటు వస్తుందా రెండు ఓట్లు వస్తాయా అనేది కాదు. కచ్చితంగా రాజకీయంగా ఒక ముందడుగు వేసినట్లే. దీనిని ప్రతి ఒక్కరు స్వాగతించాలి. రాజ్యంగం కల్పించిన హక్కును వాడుకునే స్వేచ్ఛ మనకు ఉండాలి. అలాగే క్షేత్రస్థాయిలో వాలంటీర్లు చేస్తున్న పనుల మీద సర్పంచులు దృష్టి పెట్టండి. సర్పంచులకు జీవిత బీమా ఉండాలి అని జనసేన భావిస్తోంది దానికి మేం కట్టుబడి ఉంటాం.

మంగళగిరిలో ఉన్న ఈ కార్యాలయం కేవలం జనసేన పార్టీది మాత్రమే అనుకోవద్దు. ఇది రాష్ట్ర సమస్యల మీద చర్చించిన కార్యాలయంగా ప్రతి ఒక్కరు భావించండి. అంతా ఐక్యంగా గ్రామ పంచాయతీల సమస్యల మీద పోరాడుదాం” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

అప్పుల ఊబిలో ఆంధ్ర ప్రదేశ్: విశ్రాంత ఆర్థికవేత్త విశ్లేషణ

Spread the love